అప్పుడు పవన్, ఇప్పుడు కమల్.. మనసు మార్చుకున్నారా!

pawan-kalyan-and-kamal-haas

ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా దగ్గరే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకున్న క్రేజీ మల్టీస్టారర్ కాంబినేషన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే ఉలగ నాయగన్ కమల్ హాసన్ ల ప్రాజెక్ట్ నిలిచింది అని చెప్పొచ్చు. ఇద్దరు దిగ్గజ స్టార్స్ కలయికలో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఊహించని రికార్డులు సెట్ చేస్తుంది అని ఆల్రెడీ అంతా గట్టిగా నమ్ముతున్నారు.

అయితే ఈ సినిమా కోసం కమల్ హాసన్ గతంలో తీసుకున్న కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టే అని చెప్పాలి. మన స్టార్స్ కి అంటూ కొన్ని ట్యాగ్స్ ఎంతో కాలం నుంచి చెలామణి అవుతున్న సంగతి తెలిసిందే. అలానే కమల్ హాసన్ కి ఉన్న ఉలగనాయగన్/ యూనివర్సల్ హీరో అదే మన తెలుగులో అయితే లోక నాయకుడు అనే ట్యాగ్ ని 2024 నవంబర్ నుంచి వద్దని చెప్పేసారు.

ఎవరూ ఇక అలా పిలవొద్దని చెప్పేసారు. కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్ట్ కి మాత్రం మళ్ళీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ వేసి ప్రెజెంట్ చేశారు. సో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టే అని చెప్పాలి. మరి ఇదే విధంగా మన తెలుగు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య ట్యాగ్ ని రద్దు చేసుకున్నారు.

అలానే భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలు వచ్చాయి. కానీ రీసెంట్ గా ఓజి, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి మళ్ళీ పవర్ స్టార్ ట్యాగ్స్ పడ్డాయి. సో మళ్ళీ అభిమానుల కోసమో లేక దర్శకుల రిక్వెస్ట్ వల్లనో ఫైనల్ గా మళ్ళీ తమ పవర్ఫుల్ ట్యాగ్ లైన్స్ వద్దకే వచ్చారు.

Exit mobile version