అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ నటి సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం “తండేల్”. కొన్ని వాస్తవిక సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అందులో అందమైన కల్పిత ప్రేమ కథను జోడించి మేకర్స్ సూపర్ హిట్ కొట్టారు. అంతే కాకుండా నాగ చైతన్య కెరీర్లోనే మొదటి 100 కోట్ల గ్రాస్ సినిమాగా తండేల్ అదరగొట్టింది.
అయితే లేటెస్ట్ గా ఓటిటిలో కూడా వచ్చేసిన ఈ సినిమా థియేటర్స్ లో రన్ ని పూర్తి చేసుకుంది. మరి ఈ నెల రోజుల్లో తండేల్ ఫైనల్ వసూళ్లు మేకర్స్ రివీల్ చేశారు. దీనితో ఈ సినిమా మొత్తం 115 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ తెలుపుతున్నారు. ఇలా మొత్తానికి తండేల్ ఫైనల్ వసూళ్లు ముగించింది అని చెప్పవచ్చు. ఇక ఓటిటిలో మంచి ఆదరణ అందుకోనుంది. మరి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించారు.
THE BLOCKBUSTER LOVE TSUNAMI is a SENSATION AT THE BOX OFFICE ❤️????????#BlockbusterThandel collects over 115 CRORES GROSS WORLDWIDE ????????
Book your tickets for #Thandel now!
????️ https://t.co/5Tlp0WNszJ#BlockbusterLoveTsunami pic.twitter.com/CSgQQjUAk1— Thandel (@ThandelTheMovie) March 7, 2025
