
ప్రతి వారంలానే ఈ వరం కూడా బాక్స్ ఆఫీసు వద్ద రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమవుతున్నాయి. అనులో ఒకటి సూపర్ స్టార్ పవర్ ఉన్న ‘సైజ్ జీరో’, రెండవతో చిన్న సినిమాగా నూతన తారలతో రానున్న సినిమా ‘తను నేను’. అన్సుహ్క, ఆర్య, సోనాల్ చౌహాన్ లాంటి స్టార్స్ ఉండడం వలన ‘సైజ్ జీరో’కి బాగానే క్రేజ్ ఉంది. కావున దాన్ని పక్కన పెడితే, తను నేను అనే చిన్న సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు, కానీ వాళ్ళకి సూపర్ స్టార్ సపోర్ట్ మాత్రం ఉంది. ఎవరీ సూపర్ స్టార్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..
‘తను నేను’ సినిమా ద్వారా డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు శోభన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసాడు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు సంతోష్ శోభన్ నడ తను నేను టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పి తన సపోర్ట్ ని తెలియజేశాడు. ‘స్వర్గీయ శోభన్ తో పనిచేసిన మెమొరీస్ నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆయన తనయుడు సంతోష్ శోభన్ యాక్టింగ్ ని సెలక్ట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తను – నేను సినిమా రిలీజ్ కి సిద్దమైంది.. ఈ టీంకి సక్సెస్ రావాలని కోరుకుంటున్నానని’ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. సంతోష్ శోభన్ హీరోగా అవిక గోర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో రవిబాబు ముఖ్య పాత్రలో పోషించగా రాధా మోహన్ దర్శకుడు.