ట్రైజర్ టాక్ : ‘గాయపడ్డ సింహం’తో నవ్వులు పూయిస్తున్న తరుణ్ భాస్కర్

Gaaya Padda Simham 2

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవన్ సాదినేని సమర్పిస్తున్నారు. చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలని కలలు కని, తీరా అక్కడికి వెళ్ళాక డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో కథానాయకుడు చిక్కుల్లో పడటం అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తన సొంత సినిమా ‘పెళ్లి చూపులు’ ఓవర్‌రేటెడ్ అంటూ తనను తాను ట్రోల్ చేసుకున్న సీన్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఫరియా అబ్దుల్లా, శుభలేఖ సుధాకర్ కె.జి.ఎఫ్ స్టైల్ నరేషన్‌తో నవ్వులు పంచుతుండగా, మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ 2026లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version