రానా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న యువ దర్శకుడు !

Tharun Bhaskar rana

తన మొదటి సినిమా’ పెళ్లిచూపులు’తో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్త వాళ్లతో తీసిన తాజా చిత్రం ఈ నగరానికి ఏమైంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది . వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి .

ఇక ఈ చిత్రం తరువాత మళ్ళి ఇదే నిర్మాణ సంస్థలో తరుణ్ భాస్కర్ మరో చిత్రాన్ని చేయనున్నారని తెలిసిందే . అయితే ఈ చిత్రంలో రానా హీరో గా నటించనున్నట్లు సమాచారం. ఆయన కోసం తరుణ్ ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ను స్టార్ట్ చేశారట. మరి ఈ యువ దర్శకుడు రానా కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి .

Exit mobile version