పెళ్లి చూపులు డైరెక్టర్ సెకండ్ ప్రాజెక్ట్ ఫినిష్!

పెళ్లి చూపులు సినిమాతో ఎవరు ఉహించని విధంగా మంచి హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండవ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తరుణ్ రెండవ సినిమాతో కూడా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సమయాన్ని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాడు. గత ఏడాది కొత్త నటి నటులతో ఒక సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే రీసెంట్ గా ‘ఈ నగరానికి ఏమైంది’ అనే ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో పూర్తిగా కొత్త నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ తరహాలో సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక త్వరలో మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది. పెళ్లి చూపులు సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version