
నేను ఎటువంటి నేరమూ చేయలేదు, నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. త్వరలో నిజం తెలుస్తుంది అని అన్నారు సినీనటుడు, దర్శకుడు మదాల రవి. ఓ యువతిని వేధించిన కేసులో మదాల రవిని అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన ఆరోపణలపై మీడియాకు వివరణ ఇచ్చారు.
నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టినట్టు కొన్ని పత్రికలు, సోషల్ వెబ్‌సైట్స్‌లో నాపై దుష్ప్రచారం జరిగింది. నేను ఆరోజు రాత్రే బెయిల్‌పై ఇంటికివచ్చేశాను. ఎటువంటి జైలుకి వెళ్ళలేదు. అవన్నీ అవాస్తవాలే. కొందరు కావాలనే అన్యాయంగా నాపై ఆరోపణలు చేశారు. వాటిలో ఎటువంటి నిజం లేదు. అన్యాయంగా నాపై కేసు పెట్టారు, దానిపై నేను కోర్టులోనే పోరాటం చేస్తాను. నాకు మన న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. త్వరలో నిజాలు వేలుగుచూస్తాయి. నేను ఎటువంటి నేరమూ చేయలేదు కనుక నాకు నూటికి నూరు శాతం న్యాయం దక్కుతుందని ధృడంగా నమ్ముతున్నాను. అని మదాల రవి వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం మదాల రవి ‘అలౌకిక’ అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. గతంలో ‘నేను సైతం’, ‘ఇలవేల్పు’, ‘బ్రోకర్ 2’ సినిమాలలో నటించారు. విప్లవ నటుడు, నిర్మాత మాదాల రంగారావు కుమారుడయిన రవి రష్యాలో డాక్టర్ చదివారు.