ఆ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ కాబోతోంది !

టచ్ చేసి చూడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. విక్రమ్ సిరకొండ దర్శకత్వం వహించిన ఈసినిమాను నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.రాశిఖాన్న, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

ఈ మూవీలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇంటర్వెల్ బ్లాక్ లో రవితేజ పోలీస్ పాత్రలో ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. ఆ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి. ఈ సినిమా తరువాత రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేలటికెట్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే,

Exit mobile version