చరణ్ సందిగ్ధం అదేనట..!

Ram Charan 2

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటిం విరామంలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం మొదలు కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. లేటెస్ట్ షెడ్యూల్ రాజమౌళి నార్త్ ఇండియా లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా ఈ చిత్రంలో నటిస్తుండగా జనవరి 8, 2021లో విడుదల కానుంది.

ఐతే ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కూడా ప్రకటించేశారు. ఆయన ఆర్ ఆర్ ఆర్ తరువాత త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నారు. ఐతే రామ్ చరణ్ ఇంత వరకు తదుపరి చిత్రాన్ని డిసైడ్ చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయాలనే సందిగ్ధంలో ఆయన ఉన్నారట. అందుకే ఆచి తూచి కథను, దర్శకుడిని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడట.

Exit mobile version