‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ హైలెట్ అట !

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ పై వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్స్ అదిరిపోతాయట. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోతోందని.. పైగా ఈ సినిమాకే కాకుండా, ప్రభాస్ సినీ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచిపోతుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కచ్చితంగా ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.

కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది.ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.

Exit mobile version