బాలయ్య సినిమాలో ఆ తమిళ హీరో ?

బాలయ్య సినిమాలో ఆ తమిళ హీరో ?

Published on Aug 30, 2026 11:09 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం తమిళ హీరో ఆర్యని ఎంపిక చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట. ఓ పోలీస్ పాత్రలో ఆర్య కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక కొరటాల శివ సినిమా అనగానే కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది.

మరి ఈ సినిమా నేపథ్యం ఏమై ఉంటుంది ? అంటూ నెటిజన్లు చర్చ మొదలు పెట్టారు. ఇప్పటివరకు ఉన్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో బాలయ్యను మాత్రం పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు