‘రామాయణ’ పై నటుడు క్రేజీ కామెంట్స్ !

Ramayana

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాత్రల గురించి నటుడు అరుణ్‌ గోవిల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఏదైనా సినిమా వస్తుందంటే దానిని పోల్చడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం దేవుడి పాత్ర పోషించేటప్పుడు చూడగానే అలానే కనిపించాలని. అందుకే, లుక్స్‌ చాలా ముఖ్యం’ అని తెలిపారు.

అరుణ్‌ గోవిల్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆడియన్స్‌ తెరపై మనల్ని చూడరు.. మన పాత్రలో ఉన్న దేవుడిని చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉండటాడేమో అనుకోవాలి. అంతలా మనం ప్రభావితం చేయాలి’’ అని చెప్పారు. ఇక ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు.

Exit mobile version