
ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా లేదా రెండు సినిమాలు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంటాయి. అందులో ప్రేక్షకులు మెచ్చినవి హిట్స్ అవుతాయి, మిగతావి ఫ్లాప్స్ లిస్టులో కలిసిపోతాయి. ప్రతి వారం హిట్టయ్యే సినిమాల కంటే ఫ్లాప్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉంటాయి. ఇక ఈ వారం విషయానికి వస్తే బాక్స్ ఆఫీసు వద్ద ఒకేసారి 8 సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో మూడు సినిమాలు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోలు నటించినవి అయితే మిగతా సినిమాలు అన్నీ కొత్త వారివి.
యంగ్ హీరో ఆది-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రఫ్’ రేపు రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మూవీ ‘యమలీల’కి సీక్వెల్ గా ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల 2’ సినిమా కూడా రేపే రిలీజ్ కానుంది. ఇందులో కెవి సతీష్ హీరోగా నటిస్తే, డా. మోహన్ బాబు యమధర్మరాజుగా కనిపిస్తాడు. అలాగే అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, కుషి నటించిన ‘అలా ఏలా’ సినిమా కూడా రేపే రిలీజ్ అవుతోంది.
ఇది కాకుండా ‘భూ’, ‘డేగ’, ‘వెల్ కమ్ టు అమెరికా’, ‘శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర’ మరియు ‘థర్డ్ మాన్’. ఇలా మొత్తం రేపు 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి అందులో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో, ఎన్ని సినిమాలు తుస్సుమంటాయో చూడాలి..