గ్రాఫిక్స్ వలెనే విడుదల ఆలస్యం – ‘బూచమ్మ బూచోడు’ దర్శకుడు.

Shivaji-with-Director-Revan
గుణశేఖర్ వద్ద దర్శకత్వ శాఖలో పలు హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన రేవన్ యాదు ‘బూచమ్మ బూచోడు’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తయినా సినిమా ఆలస్యంగా విడుదల చేయడానికి గ్రాఫిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడమే కారణం అని తెలిపారు. శివాజీ, కైనాజ్ మోతివాలా జంటగా రేవన్ యాదు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సినిమా సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదలవుతుంది.

హారర్ కామెడీతో పాటు ఫ్యామిలీకి సంబందించిన మెసేజ్ కూడా ఇచ్చాం. నిర్మాత ఖర్చు పెట్టిన ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వలేదు. చెప్పిన బడ్జెట్లో అనుకున్న సమయంలో సినిమా షూటింగ్ పూర్తి చేశాను. నిర్మాత శ్రేయస్సు కోరే వ్యక్తిని నేను. హారర్ సన్నివేశాలు బాగా రావడం కోసం గ్రాఫిక్స్ పనులలో మరింత శ్రద్ధ తీసుకోవడం వలన ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి అని దర్శకుడు తెలిపారు.

Exit mobile version