‘బిగ్ బీ అమితాబ్’కు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ !

amithab

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ప్రకటించారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. బిగ్ బీ 1970 లో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా పొందారు. పైగా భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు. ముఖ్యంగా 1970, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని “ఒన్ మాన్ ఇండస్ట్రీ”గా అభివర్ణించారు అంటే అమితాబ్ స్టార్ డమ్ అంటే అర్ధం చేసుకోవచ్చు.

ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు. ఉత్తమ నటుడు కేటగిరీకిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్ కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడు కూడా బచ్చనే. నటునిగానే కాక, నేపధ్య గాయునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు ఆయన. 1980లలో రాజకీయాలలో కూడా క్రీయాశీలకంగా పనిచేశారు అమితాబ్.

ఇక 1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన “లెగియన్ ఆఫ్ హానర్”తో గౌరవించింది. ఇప్పుడు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ కూడా రావడంతో ఆయన అభిమానులకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Exit mobile version