తమిళంలో ‘ది లెజెండ్’ అనే సినిమాతో హీరోగా మారాడు లెజెండ్ శరవణన్. వ్యాపారవేత్తగా గుర్తింపు ఉన్న ఆయన ది లెజెండ్ చిత్రాన్ని సొంతంగా ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాను 2022లో రిలీజ్ చేయగా మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆయన తన రెండో సినిమాను ప్రకటించారు.
‘లీడర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో శరవణన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శరవణన్ కొత్త గెటప్‌లో కనిపించారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ పూర్తిగా యాక్షన్ డోస్‌తో నింపేశారు. ఈ సినిమాను ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, పాయల్ రాజ్‌పుత్, లాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ అందిస్తుండగా వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
