మాటలతో మాయ చేసిన ‘మళ్లీ మళ్లీ… ‘ ట్రైలర్

MMIRR
ముస్లిం హిందూ యువతి యువకుల మధ్య జరిగిన ప్రేమకథలను గతంలో కొందరు దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. తాజాగా శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమా కూడా అదే కోవకు చెందినది. ‘ఓనమాలు’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకుడు. ఆదివారం ఆడియోతో పాటు విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.

‘ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బ్రతికిస్తుందని నాకు ఆ రోజే తెలిసింది, ఆ చావు పేరే ప్రేమ’ – బురఖాలో హీరోయిన్ ను చూసిన హీరో డైలాగ్.

‘ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏమైనా ఉందా..?’
‘ఏ మతంలోనైన ఒకేలా ప్రేమించుకుంటారు’
– హీరోయిన్ డైలాగ్.

పైన చెప్పిన రెండు డైలాగులు చాలు హిందూ ముస్లిం ప్రేమకథను ఎంత కొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నించారో అర్ధమవుతుంది. ‘ఓడిపోయేవాడు వెంటపడతాడు…’ డైలాగ్ హీరో పాత్ర స్వభావాన్ని తెలియజేసింది. ‘ఓనమాలు’ సినిమా తర్వాత మరోసారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైతే, బుర్రా సాయి మాధవ్ రాసిన అర్ధవంతమైన, ఆలోచింపజేసే సంభాషణలు ఆ ప్రేమకథకు సరికొత్త రంగులను అద్దాయి. శర్వా, నిత్యాలు వారి పాత్రలలో ఒదిగిపోయారు.

క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కెఎస్ రామారావు సమర్పణలో కెఏ వల్లభ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. ‘రన్ రాజా రన్’ విజయంతో జోరు మీదున్న శర్వానంద్ ఖాతాలో మరో విజయం వచ్చే చేరేలా కనిపిస్తుంది.

ట్రైలర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Exit mobile version