షేర్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. భారీ అంచనాలు సెట్ చేసుకొని వచ్చిన ఈ సినిమా నాని కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ సాధించి అదరగొట్టింది. అయితే రెండో రోజు వర్కింగ్ డే కావడంతో మాత్రం వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇలా మొదటి రోజు 88 కోట్లకి పైగా గ్రాస్ అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి 100 కోట్ల మార్క్ ని ఈ సినిమా దాటేసింది.
ఇలా మొత్తం రెండు రోజుల్లో నాని సినిమా 114 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. సో ఒక్క రెండు రోజు ఈ చిత్రం 26 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇప్పుడు ఎలాగో వీకెండ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు నెంబర్స్ ఏమన్నా పెరుగుతాయేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.
