నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో కష్టపడి తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ నే ది ప్యారడైజ్. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అండ్ టీం ప్రాణం పెట్టేసి చేశారు. తన గత చిత్రం దసరా కోసం తాను ఎంత కష్టపడ్డాడో కానీ దానికి ఎన్నో రెట్లు శ్రద్ధతో, హార్డ్ వర్క్ తో చేశారు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాలేని బిజీగా కేవలం సినిమా కోసం పని చేస్తూ నిరంతరం ఈ సినిమా కోసమే తాపత్రయ పడ్డాడు.
అయితే ఈ సినిమాకి నాని చేసిన డేరింగ్ స్టెప్పులలో తనకి రెండు జడలు కూడా ఒకటి. అయితే ఈ లుక్ కి ప్రేరణ మాత్రం తన చిన్నప్పుడు తన ఇంట్లో కూడా అలానే రెండు జడలు వేశారని పలు సందర్భాల్లో తెలిపాడు. ఇక సరిగా సినిమా విడుదల ముందు ఓ ఎమోషనల్ పోస్ట్ ని తాను షేర్ చేసుకున్నాడు.
తన చిన్నప్పుడు జడలతోనే ఉన్న పిక్ ని షేర్ చేసి “జడల్ పుట్టుక, పోరాటం కల్పితం కావచ్చు. కానీ అతని జడలు, రూపం నా చిన్ననాటి నుండి ప్రేరణ పొందాయి. నేను పెరిగేకొద్దీ, ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు నా చిన్ననాటి జ్ఞాపకాలతో ప్రభావితమయ్యాయి. నాకు ఐదారు సంవత్సరాలు వచ్చే వరకు అమ్మ జడలు వేసి కట్టేది.
నేను పెద్దయ్యాక, కమర్షియల్ సినిమాలో 70MM తెరపై జడలతో ఒక హీరో ఎలా కనిపిస్తాడో అని ఎప్పుడూ ఊహించుకునేవాన్ని, ఇక ప్రస్తుతానికి వస్తే, నా హీరో నాని అన్నను జడలతో మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ చిత్రం కేవలం నా చిన్ననాటిది కాదు. ఇదే నా ప్యారడైజ్. మరికొన్ని గంటల్లో మీ అందరినీ ప్యారడైజ్ కి ఆహ్వానిస్తున్నాను”. అని తను తెలిపాడు. దీనితో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.
Jadal's birth and battle might be fictional…but his braids & look were inspired from my childhood… Alot of the scenes in the film are influenced by my childhood as i grew up…
Amma❤️ used to grow and tie Jadal until i turned 5 or 6 years… and as i grew older i always… pic.twitter.com/ZRs2ieAs0W
— Srikanth Odela (@odela_srikanth) September 23, 2026


