నాని సినిమా అసలు భవిష్యత్తు ఇప్పుడు తెలిసిపోతుంది!

నాచురల్ స్టార్ నాని హీరోగా గ్లామరస్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే ది ప్యారడైజ్. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుని కూడా ఇప్పుడు 150 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టింది. అయితే ఇక ఈ సినిమా భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు తేలుతుంది అని చెప్పవచ్చు.

వీకెండ్ వరకు వేరే ఏ పెద్ద పోటీ లేకపోవడంతో హాలిడే అడ్వాంటేజ్ లు సినిమాకి కలిసి వచ్చాయి. కానీ ఇప్పుడు సోమవారం నుంచి అసలు టెస్ట్ ఉంటుంది. ఇక ఈ పని దినాల్లో కూడా సినిమా స్ట్రాంగ్ గా పెర్ఫార్మన్స్ చేస్తే మాత్రం టాక్ ని సైతం తట్టుకొని లాభాల దిశగా వెళ్లినట్టే అని చెప్పొచ్చు. సో నాని సినిమా వీక్ డేస్ లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహించారు.

Exit mobile version