న్యాచురల్ స్టార్ నాని నటించిన ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో సంచలన రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్రియేట్ చేసిన ది ప్యారడైజ్ ప్రపంచాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ చిత్రానికి జరుగుతున్న టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది.
ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుండటంతో ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ నెంబర్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్లో 1.1 మిలియన్ మార్క్ దాటేసిన ది ప్యారడైజ్ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎర్లీ ప్రీమియర్ షోలకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ లెక్కలు మరింత పెరిగి రూ.80 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వారు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ది ప్యారడైజ్ చిత్రంతో నాని బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాతో నాని తన కెరీర్లోనే హయ్యె్స్ట్ ఓపెనింగ్స్ సాధించేందుకు సిద్ధమవుతున్నాడు.
