లేటెస్ట్: నైజాంలో ‘ది ప్యారడైజ్’కి వచ్చేసిన పర్మిషన్లు.. డీటెయిల్స్ ఇవే!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘ది ప్యారడైజ్’. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసమే ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకి ముందు మేకర్స్ స్వల్ప టికెట్ ధరల హైక్ లతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల చేస్తామని తెలిపారు.

ఇక ఇందులో భాగంగా ఈ సినిమాకి అనుకున్నట్టుగానే ముందు నైజాం మార్కెట్ లో హైక్స్ సహా ప్రీమియర్స్ కి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే తెలంగాణాలో రిలీజ్ కి ముందు రోజు సాయంత్రం ఆరున్నర గంటలకే ప్యారడైజ్ ఆటలు మొదలు కానున్నాయి. ఈ ప్రీమియర్స్ షోస్ కి గాను టికెట్ ధర 500 రూపాయలు ఖరారు చేశారు.

సింగిల్ స్క్రీన్స్ ధరల వివరాలు:

సినిమా రిలీజ్ డేట్ నుంచి అంటే సెప్టెంబర్ 24 నుంచి సింగిల్ స్క్రీన్స్ కి 4 రోజులు పాటుగా అదనంగా 48 రూపాయలు ఆ తర్వాత నుంచి మరో ఆరు రోజుల పాటుగా 23 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.

మల్టీప్లెక్స్ లలో ధరల వివరాలు:

ఇక మల్టీప్లెక్స్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 24 నుంచి 4 రోజులు పాటు అదనంగా 95 రూపాయలు ఆ తర్వాత నుంచి మరో ఆరు రోజుల పాటుగా 45 రూపాయలు పెంచి అనుమతులు ఇచ్చారు.

సో మొత్తానికి ది ప్యారడైజ్ నైజాం మార్కెట్ లో సాలిడ్ నంబర్స్ సెట్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Exit mobile version