న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ప్రెస్టీజియస్ చిత్రం ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించడంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పుకార్లకు చెక్ పడింది. ఇక నాని పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌ను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో నార్త్‌లోనూ ఈ సినిమాను గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ది ప్యారడైజ్’ హిందీ రిలీజ్ కచ్చితంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
దీంతో నాని మరోసారి నార్త్ బెల్ట్‌లో ‘ది ప్యారడైజ్’ చిత్రం ద్వారా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Undhi 🎯
— THE PARADISE (@TheParadiseOffl) September 7, 2026
