‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ‘డాంగ్ డాంగ్’.. మహేష్ డాన్స్ హైలైట్ !

sarileru nekevvaru 2

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి డాంగ్ డాంగ్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. సినిమాలో కీలకమైన సన్నివేశంలో రానున్న ఈ సాంగ్ లో మహేష్ బాబు స్టెప్స్ సాంగ్ మొత్తానికే హైలెట్ గా నిలిచాయి. ఈ సాంగ్ ప్రోమోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగి మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా సాంగే రిలీజ్ అయింది. ఇక మహేష్ ఫ్యాన్స్ ఈ సాంగ్ ను లైక్ లతో షేర్ లతో టాప్ ట్రెండింగ్ లో తీసుకెళ్తున్నారు. ఇక రామజోగయ్య లిరిక్స్ అండ్ దేవి మ్యూజిక్ సాంగ్ ను చక్కగా తీర్చిదిద్దితే.. మహేష్ – తమన్నాల డాన్స్ సాంగ్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి.

కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version