పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ పర్ఫార్మెన్స్కు అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రన్ కంటిన్యూ చేస్తోంది.
ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో ‘ది రాజా సాబ్’ చిత్రానికి ఇప్పటివరకు ఏకంగా 1.7 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో టికెట్ బుకింగ్స్ జరగడంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేశారు.
