పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది. ఫలితంగా ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమాపైనే ఆశలన్ని పెట్టుకున్నారు ఇందులో నటించిన ముగ్గురు హీరోయిన్లు.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ‘రాజా సాబ్’ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తమ కెరీర్‌కు సాలిడ్ బూస్ట్ ఇస్తుందని వారు మరే ఇతర ప్రాజెక్టులను ఓకే చేయలేదు. కట్ చేస్తే, రాజా సాబ్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆ ముగ్గురు హీరోయిన్లు డైలమాలో పడిపోయారు. తమ వద్దకు వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేసి మరీ రాజా సాబ్ మూవీలో నటిస్తే, ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది.
ఇప్పుడు పెద్దగా ఆఫర్లు ఏమీ లేకపోవడంతో ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా ఆలోచనలో పడ్డారట. మరి ఈ ముగ్గురు హీరోయిన్లకు మున్ముందు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.
