సాధారణ ధరలతో ‘ది రాజా సాబ్’ టికెట్లు.. బూస్టప్ దొరికేనా..?

The Raja Saab

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సంక్రాంతి కానుకగా జనవరి 9న పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ – ఫాంటసీ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.183 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే అంచనాలకు తగిన స్థాయిలో బాక్సాఫీస్ ఊపు కొనసాగడం లేదు. దీంతో ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేందుకు నిర్మాతలు టికెట్ ధరలను నేటి నుంచి మళ్లీ సాధారణ రేట్లకు తీసుకువచ్చారు. ఈ నిర్ణయం థియేటర్లకు ప్రేక్షకుల రాకపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

ఈ చిత్రంలో సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, సప్తగిరి, సత్య, VTV గణేష్ తదితరలు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.

Exit mobile version