ఏపీలో ‘ది రాజా సాబ్’ టికెట్ రేట్లు పెంపు.. ప్రీమియర్ షో టికెట్ ధరలు ఎంతంటే..?

The Raja Saab

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు.

అయితే, తాజాగా ఏపీ ప్రభుత్వం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) టికెట్ రేట్లను పెంచుతూ జీవో జారీ చేసింది. ఏపీలో ‘ది రాజా సాబ్’ చిత్ర టికెట్ రేట్లను సింగిల్ స్క్రీన్స్‌కు రూ.150/-, మల్టీప్లెక్స్‌లకు రూ.200/- చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఏపీలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్ర టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.297.5/- గా.. మల్టీప్లెక్స్‌లలో రూ.377/- గా ఉండనున్నాయి. ఈ టికెట్ ధరల పెంపు రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు అమలులో ఉండనుంది. దీంతో పాటు ఈ పది రోజులు ఈ చిత్రాన్ని 5 ఆటలు వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అంతేగాక, ‘ది రాజా సాబ్’ స్పెషల్ ప్రీమియయర్స్‌కు జనవరి 8న ఒక్కో టికెట్ ధరను రూ.1000/-గా ఫిక్స్ చేసింది. దీంతో ఏపీలో ‘ది రాజా సాబ్’ చిత్రానికి సాలిడ్ బూస్ట్ లభించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్, బొమన్ ఇరాని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version