సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు 4 సంవత్సరాల తర్వాత తన భిమానుల ముందుకు ‘లింగ’ సినిమాతో రానున్నాడు. ఈ సినిమా కోసం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రజినీ అభిమానులే కాకుండా వరల్డ్ వైడ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎఆర్ రెహమాన్ అందించిన లింగ సినిమా ఆడియో ఈ రోజు చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఆడియో రిలీజ్ సమయంలో ఈ సినిమా టైటిల్ వెనకున్న అసలు కథ బయటకి తెలిసింది. ఈ సినిమాలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో ఒక పాత్ర పేరు రాజ లింగేశ్వరన్.. ఆ పేరు నుంచి సినిమా కోసం ‘లింగ’ అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ అప్పటికే ఆ టైటిల్ ని ధనుష్ సినిమా కోసం బుక్ చేసారు. కానీ కెఎస్ రవికుమార్ తమ సినిమాకి ఆ టైటిల్ బాగా సెట్ అవుతుందని, కావాలని అడగడంతో ధనుష్, అతని నిర్మాతలు ఒప్పుకొని ఆ టైటిల్ ని రజినీకాంత్ సినిమాకి ఇచ్చేసారు.
రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించాడు. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.
