పవన్ సినిమా చేస్తే స్టోరీ అదేనట

pawan7

పవన్ రాజకీయాలలో బిజీ ఐపోయారు. అన్నయ్య చిరంజీవి పుణ్యమా అని కొంచెం సినిమా వాతావరణం వైపు ఆయన మరలడం జరిగింది. సైరా నటించిన చిరంజీవి చిత్రం కావడంతో పాటు, స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథకు సంబందించిన చిత్రం కావడంతో ఆయన ఈ మూవీ వేడుకలలో పాల్గొనడం జరిగింది. దీనితో పవన్ అభిమానులకు మరలా ఆయనను వెండి తెరపై చూడాలన్న ఆశను రాజేసింది. విజయాపజయాలలో సంబంధం లేకుండా ఆయన వెండి తెరపై కనిపిస్తే వెర్రెత్తిపోయే అభిమానులకు ఆయన్ను మళ్ళీ ఒక్కసారైనా తెరపై చూడాలన్న కోరిక కలిగింది.

ఐతే పవన్ తో ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ కంటెంట్ ఉన్న మూవీ చేయాలనీ అన్నగారైన చిరు కోరిక కూడా.తదుపరి ఎలక్షన్స్ కి ఇంకా నాలుగున్నరేళ్ల కాలం ఉన్న నేపథ్యంలో పవన్ పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడేలా ఒక పొలిటికల్ డ్రామా తెరకెక్కిస్తే బాగుండు అనేది మెగా కుటుంబంతో పాటు, ఆయన అభిమానుల కోరిక. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో ఓ పూర్తి స్థాయి సోషల్ కంటెంట్ ఉన్న చిత్రం చేయలేదు. కాబట్టి తన రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఓ మూవీ చేయొచ్చు. చూద్దాం మరి పవన్ భవిష్యత్తులో ఏమి చేయనున్నారో ?.

Exit mobile version