‘ఆదర్శ కుటుంబం’ కోసం అవి చేయాల్సిందే !

‘ఆదర్శ కుటుంబం’ కోసం అవి చేయాల్సిందే !

Published on Sep 27, 2026 8:01 AM IST

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా పై అంచనాలు ఉన్నప్పటికీ, ఆ అంచనాలను ప్రేక్షకుల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లేలా సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్ ఎలిమెంట్స్ ను హైలైట్ చేస్తూ క్యారెక్టర్ ఇంట్రోస్, షార్ట్ వీడియోలు, ఫన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం వంటివి ఇంకా వేగవంతం చేయాలని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. నిజానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు ఫ్యామిలీ మీట్, కాలేజ్ ఈవెంట్స్ వంటి ఇంటరాక్టివ్ ఈవెంట్స్ నిర్వహిస్తే.. తక్కువ టైమ్ లోనే సినిమాపై మరింతగా ఆసక్తి పెరగొచ్చు.

అలాగే, ట్రెండింగ్ రీల్స్, మీమ్స్, సెలబ్రిటీ రియాక్షన్ వీడియోలతో సోషల్ మీడియాలో కంటెంట్‌ను వైరల్ అయ్యేలా ప్లాన్ చేయాలి. ఇలా థియేట్రికల్ కంటెంట్‌తో పాటు డిజిటల్ ప్రమోషన్స్‌ను కలిపి బలమైన క్యాంపెయిన్‌గా నడిపితే ఈ సినిమా పై బజ్‌ మరింతగా పెరుగుతుంది. కాగా ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు