ఇలాంటివి మరింత జోష్‌నిస్తాయి – మెగాస్టార్

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సంక్రాంతికి స్పెషల్ గా విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమా సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ మీట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమాలన్నీ ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ..ఇలాంటి చిత్రాలు మరింత జోష్‌నిస్తాయి. నేను సినిమా ఫలితాల విషయంలో తప్పు నాపై వేసుకుంటా కానీ.. ఒకరిపై నెట్టను. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడతాం. ఇష్టంగానే పూర్తి చేస్తాం. కొన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని జోష్‌ని ఇస్తాయి’’ అని మెగాస్టార్ తెలిపారు.

మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక సినిమా షూటింగ్‌ సమయంలో చిత్రబృందం ఫ్యామిలీలా కలిసిపోతే ఆ ఎఫెక్ట్‌ కచ్చితంగా తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాకి అదే జరిగింది అని, ఇది తాను బలంగా నమ్ముతానని చిరంజీవి అన్నారు. మొత్తానికి చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version