పవన్ క్రేజ్ కు స్టన్ అయిపోయిన బాలీవుడ్ స్టార్ నటుడు.!

pawan 5

మన దక్షిణాదిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. ఇక్కడ పవన్ కు ఉన్న ఫాలోయింగ్ ను చూసి ఎందరి స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు స్టన్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాగే పవన్ క్రేజ్ ను చూసి ఓ బాలీవుడ్ స్టార్ నటుడికి కూడా మైండ్ బ్లాక్ అయ్యిందట.

అతడే బొమన్ ఇరానీ. బాలీవుడ్ లో మంచి మంచి ఫేమ్ ఉన్న ఈ నటుడు పవన్ తో కలిసి “అత్తారింటికి దారేది” అలాగే “అజ్ఞ్యాతవాసి” చిత్రాల్లో నటించారు. తాను మాట్లాడుతూ “ఓ ఆడియో ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ అలా చీర్ చేస్తూ ఉండడం చూసి స్టన్ అయిపోయాను.

కానీ పవన్ మాత్రం సెట్స్ లో చాలా కామ్ అండ్ ఒక జెంటిల్ మెన్ లా మర్యాదగా నడుచుకుంటారు. అత్తారింటికి దారేది సినిమా టైం లో మా ఇద్దరికీ పెద్దగా సీన్స్ లేకపోయినా పవన్ నాకు థాంక్స్ చెప్పారు.” అని బొమన్ అన్న మాటలు ఇప్పుడు బయటకొచ్చాయి. ప్రస్తుతం పవన్ తన “వకీల్ సాబ్” షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version