బిగ్ బాస్ 4 – ఫైనల్స్ లో మరింత స్ట్రాంగ్ అవుతున్న ఈ కంటెస్టెంట్ క్రేజ్?

Bigg 1

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు వెర్షన్ లో నాలుగో సీజన్ మరికొన్ని రోజుల్లో ముగిసిపోనుంది. మరి ఈ టైం లో అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్నే టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది. మరి ఈ రేస్ లో ఇప్పటికే కొంతమంది పేర్లు ఆడియెన్స్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిపోయారు.

మరి వారిలో ఒకడైన సోహెల్ కు మాత్రం సరిగ్గా ఈ ఫైనల్స్ కు వచ్చిన తర్వాత అనూహ్యంగా మరింత స్ట్రాంగ్ క్రేజ్ సంతరించుకుంటున్నట్టు టాక్. సోహెల్ ఎంత కోపిష్టి అయినప్పటికీ ఆడియెన్స్ మాత్రం తన హార్ట్ పరంగా ఎలాంటి కల్మషం లేనివాడు సోహెల్ అని చివరి నిమిషంలో గట్టిగానే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు.

మరి సోహెల్ ఎలాంటి స్థానంలో నిలుస్తాడు అన్నది ఫైనల్స్ లో చూడాల్సిందే. ఇక ఈసారి సీజన్లో ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మరోసారి వస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Exit mobile version