లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ట్ చేసిన చిత్రం “అయ్యప్పణం కోశియుమ్” రీమేక్. మళయాళంలో బిగ్గెస్ట్ హిట్ కాబడిన ఈ చిత్రంలో పవన్ మరియు రానా లు ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే ప్రతీ ప్రకటనతో కూడా మేకర్స్ భారీ హైప్ ను సంతరించుకుంటున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో ప్రతీ ఒక్కరికీ పవన్ ఇచ్చే డేట్స్ మాత్రమే అత్యంత కీలకంగా మారింది. అంతే కాకుండా పవన్ ఇచ్చే ఈ కొద్ది రోజుల డేట్స్ కు గాను భారీ రెమ్యునరేషన్ నే తీసుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే గతంలో పవన్ ఈ చిత్రానికి గాను 50 నుంచి 55 రోజుల కాల్షీట్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది.
కానీ లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ చిత్రానికి పవన్ కేవలం 40 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారని అలాగే ఇందుకు గాను 50 నుంచి 55 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ను తీసుకున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ ఇచ్చే డేట్ కు గాను భారీ డిమాండ్ అయితే ఉంది కానీ ఈ రేంజ్ ఉందో లేదో జస్ట్ టాక్ కి మాత్రమే పరిమితం. ఇక ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
