కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన సూర్య హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో చేస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ తర్వాత ఏ ఓటిటిలో వస్తుంది ఎవరు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్నారు అనేది రివీల్ అయ్యింది.
మరి ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తమ నెట్ ఫ్లిక్స్ పండగ అనౌన్సమెంట్ లో రివీల్ చేశారు. కేవలం తెలుగు, తమిళ్ కాకుండా మొత్తం పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తామని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసుకొస్తున్నారు.
