కొరటాల శివ -మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో ఓ యంగ్ తెలుగు హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈషా రెబ్బ మెగాస్టార్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఇప్పటికే కొరటాల కూడా ఆమెకు అవకాశం ఇస్తున్నట్లు ద్రువీకరించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి ఎండింగ్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట.
అన్నట్లు ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా రానుందట. రచయితగా ఉన్న కొరటాలకు మొదటిసారి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రభాస్ కి, మరి కొరటాల ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. అయితే ప్రభాస్ – కొరటాల సినిమా 2021లో వచ్చే అవకాశం ఉంది.
