బిగ్ బాస్ 4 – ఫైనల్ స్టేజ్ లో ఈ కంటెస్టెంట్ గ్రాఫ్ పడిపోయిందా.?

BiggBoss4 1

ఇంకొక్క రోజులో మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 కూడా ముగిసిపోనుంది. దీనితో ఎంతో ఉత్కంఠతో విన్నర్ గా నిలిచేది ఎవరు? 50 లక్షల ప్రైజ్ మనీను గెలుచుకొనేది ఎవరా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టైటిల్ రేస్ లో మొదటి నుంచీ కూడా కొంత మంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇది బిగ్ బాస్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు.

అందుకు తగ్గట్టుగానే జస్ట్ ఈ ఒక్క వారంలోనే చాలా మంది లెక్కలు మారిపోయాయి అని తెలుస్తుంది. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి అఖిల్ గ్రాఫ్ ఈ వారం వ్యవధిలోనే పడిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ కంటెస్టెంట్ విషయంలో ఆ మధ్య సోషల్ మీడియాలో బాగానే చర్చ నడిచినా ఇప్పుడు అసలే వినిపించడం లేదు. పైగా అతనికి కాకుండా ఇతర కంటెస్టెంట్స్ పేర్లే ఓటింగ్ లో దూసుకెళ్తున్నాయని మరో టాక్ వినిపిస్తుంది.

ఈసారి సీజన్లో మొట్ట మొదటి ఫైనలిస్ట్ కంటెస్టెంట్ గా నిలిచిన అఖిల్ విషయంలో అందులోనూ చివరి నిమిషంలో ఎలాంటి ఇంపాక్ట్ కలిగించకపోవడం కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సోహెల్ వల్ల ఫైనల్స్ టికెట్ దక్కించుకున్న అఖిల్ కు అక్కడ నుంచి సరైన పెర్ఫామెన్స్ చూపే స్కోప్ రాలేదు. దీనితో ఈ కంటెస్టెంట్ గ్రాఫ్ మెల్లగా తగ్గిపోవడం ఆరంభించింది. మరి ఏది ఏమైనప్పటికీ మాతం చివరి నిమిషం వరకు ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version