విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వెంకటేష్ నారప్పగా అద్భుతంగా నటించాడని.. వెంకీ కెరీర్ లోనే నారప్ప స్పెషల్ ఫిల్మ్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ సినిమా ప్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం వెంకీ చేసిన రిస్కీ స్టంట్స్ అద్భుతంగా వచ్చాయట. కాగా ఈ సీక్వెన్స్ సీన్స్ సినిమాలోనే కీలకమైనవి. ఇక ఈ చిత్రం నుండి వచ్చిన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ‘నారప్ప’గా విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు.
కాగా తమిళ్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది.