టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ చిత్రాల్లో ‘ఎపిక్’ కూడా ఒకటి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ‘బేబీ’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది.
ఈ టీజర్ లాంచ్ వేడుక ఏప్రిల్ 29న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ‘#90s’ వెబ్ సిరీస్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఒక రిఫ్రెషింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ చిత్ర టీజర్ ఈ మూవీపై ఎలాంటి అంచనాలు పెంచుతుందో వేచి చూడాలి.
