మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కొరియన్ కనకరాజు’. దక్షా నగార్కర్, రితికా నాయక్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రం నుండి ఒక ఫోక్ కార్నివాల్ సాంగ్ ‘రాసా గుమ్మడి’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల జూలై 19న సాయంత్రం 4 గంటల నుండి అనంతపురంలోని ‘వి మెగా థియేటర్’లో ఈ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పాట సినిమాకు మంచి మాస్ ఊపు తీసుకొస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన ఈ చిత్రం ఆగస్ట్ 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. థమన్ అదిరిపోయే ఫోక్ బీట్స్‌తో రాబోతున్న ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
