‘పరదా’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. కంటెంట్‌నే నమ్ముకున్న అనుపమ

Paradha

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరదా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స రెడీ అయ్యారు. ‘పరదా’ ట్రైలర్‌ను ఆగస్టు 9న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమాలో అనుపమ తో పాటు దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version