రవితేజ ‘ఇడియట్’ ట్రీట్ కి టైం ఫిక్స్!

mass jathara 1

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న రెండో సినిమానే “మాస్ జాతర”. ధమాకా తర్వాత మళ్ళీ వీరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇపుడు సాలిడ్ హైప్ కూడా నెలకొంది. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ వింటేజ్ హిట్ చిత్రం ఇడియట్ సినిమాలో సాంగ్ రీమిక్స్ చేసినట్టుగా లేటెస్ట్ ప్రోమోతో రివీల్ చేశారు.

మరి ఈ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు టైం వచ్చేసింది. ‘తూ మేరా లవర్’ అంటూ సాగే ఈ సాంగ్ ని రేపు మార్చ్ 14న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా రవితేజ శ్రీలీలపై మంచి పోస్టర్ ని వదిలి మేకర్స్ మాస్ ట్రీట్ కి సిద్ధం అవుతున్నారు. మరి ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా ఈ సాంగ్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version