‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీజర్‌కు టైమ్ ఫిక్స్ చేసిన విజయ్ సేతుపతి-పూరీ జగన్నాధ్

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూన్ 8న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ రిలీజ్‌తో సినిమా ప్రమోషన్ల వేగాన్ని పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ఈ టీజర్లో తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్ ట్రేడ్‌మార్క్ మాస్ ఎలిమెంట్స్, విజయ్ సేతుపతి విలక్షణ నటన తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version