‘రణబాలి’ ర్యాంపేజ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన విజయ్ దేవరకొండ..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రణబాలి’ నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కి్స్తున్న ఈ చిత్ర టీజర్‌ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే, రణబాలి విధ్వంసం ఎలా ఉండబోతుందో చూసేందుకు తాజాగా మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. రణబాలి టీజర్‌ను సెప్టెంబర్ 9న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. రాక్షసుడిలా కనిపించే వ్యక్తి ప్రతిజ్ఞ తీసుకుంటే ఎలా ఉండబోతుందో ఈ టీజర్‌లో చూపెట్టబోతున్నట్లు తాజాగా పోస్టర్ ద్వారా వెల్లడించారు.

మాస్, యాక్షన్ అంశాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి వస్తున్న ఈ ‘సావేజ్ ఓత్’ అప్‌డేట్ టీజర్‌పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version