
కె.ఎస్. రామారావ్ నిర్మిస్తోన్న కొత్త సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి ”అందమైన చందమామ” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. డార్లింగ్ స్వామి ఈ సినిమాకు రచయితగా పని చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో ఇది 45వ సినిమా కావడం విశేషం. ఒక లవ్ స్టోరీలోని మలుపులను ఈ చిత్రంలో అందంగా చూపించడం జరిగిందని చిత్ర వర్గాల నుండి వస్తోన్న వార్తా. ఐ.ఆండ్రూ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.