టైటిల్ సాంగ్ తో.. ‘ప్రతి రోజు పండగే’ !

prathiroju pandage

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ప్రతి రోజూ పండగే”. కాగా ఈ సినిమా నుండి ‘మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే..’ అనే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. కె.కె రాసిన ఈ సాంగ్ ను శ్రీకృష్ణ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను మంచి ఫ్యామిలీ సాంగ్ గా తీర్చిదిద్దారు. మొదటిసారి వినగానే ఈ పాట శ్రోతల్ని బాగా ఆకట్టుకుంటుంది. క్లాస్ సాంగ్ కి మంచి ఫ్యామిలీ ఎమోషన్ని టచ్ చేస్తూ పాట సాగడంతో సాంగ్ చాలా త్వరగా జనానికి కనెక్ట్ అవుతుంది.

ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version