నేటి నుంచి ‘బాహుబలి’ సెట్లో తమన్నా

Tamannaah
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హంక్ రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్న టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. మిల్క్ బ్యూటీ తమన్నా నేటి నుంచి ‘బాహుబలి’ సెట్లో సందడి చేయనుంది. తమన్నా కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబందించిన కాస్ట్యూమ్స్, తన లుక్ ని కూడా ట్రై చేసింది. ఈ మూవీ తాజా షెడ్యూల్ రేపటి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్లో మొదలు కానుంది. ఈ రోజు ఈ చిత్ర టీం నటీనటులపై రేపటి నుంచి షూట్ చేయనున్న సీన్స్ పై రిహార్షల్స్ చేస్తున్నారు.

షోల్డర్ సర్జరీ వల్ల గత కొంత కాలంగా షూటింగ్ కి దూరంగా ఉన్న ప్రభాస్ కూడా నేటి నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడు. గత కొద్ది రోజులుగా ప్రొడక్షన్ డిజైనర్ సబు సైరిల్ నేతృత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్స్ ని నిర్మించారు. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2015 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2 పార్ట్స్ గా రానున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version