2025 సంవత్సరం టాలీవుడ్‌కు (Tollywood)పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్ లేని సంవత్సరంగా మిగిలిపోయింది. పలు భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడగా, కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు మాత్రం అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అయితే, చాలా మంది స్టార్ హీరోలు ఈ సంవత్సరంలో ఎలాంటి సినిమాను తెరకెక్కించకుండా బాక్సాఫీస్ దగ్గర సైలెంట్‌గా ఉండిపోయారు.
టాలీవుడ్‌లో(Tollywood) చాలా మంది హీరోలు తమ సినిమాలతో పండుగ వాతావరణం తీసుకొస్తారు. కానీ, ఈ ఏడాదిలో కొందరు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలను రిలీజ్ చేశారు.
అయితే, 2025లో పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వంటి హీరోలు రెండేసి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేశారు. మిగతా హీరోలు ఒక సినిమాతో రావడం లేదా ఎలాంటి సినిమా రిలీజ్ లేకుండా ఉండటం చేశారు.
2025లో విక్టరీ వెంకటేష్ ఒక్కడే బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ ఏడాదికి ఓ సాలిడ్ బూస్ట్ ఇవ్వడమే కాకుండా తన కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా రూ.300 కోట్ల వసూళ్లతో దుమ్ములేపాడు.
పవన్ కళ్యాణ్‌కు ఈ ఏడాది మిశ్రమంగా గడిచిందని చెప్పాలి. ‘హరిహర వీరమల్లు పార్ట్-1’ అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మరోవైపు ‘ఓజి’ చిత్రం అభిమానులకు ఊరటనిచ్చింది. ఈ సినిమా 2025లో హయ్యెస్ట్ గ్రాసింగ్ చిత్రంగా నిలవడంతో పాటు పవన్ స్టామినా ఏమిటో చూపెట్టింది.
నందమూరి బాలకృష్ణ కూడా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డాకు మహారాజ్, అఖండ 2 – తాండవం చిత్రాలతో ఆయన ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చారు. డాకు మహారాజ్ చిత్రం యావరేజ్ రెస్పాన్స్‌ను దక్కించుకోని భారీ లాభాలను రాబట్టడంలో విఫలమైంది. ఇక ‘అఖండ 2’ పలు అడ్డంకులను దాటి థియేటర్లలో రిలీజ్ అవగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ, ఇది తొలి భాగం చిత్రం మాదిరిగా భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది.
నాగార్జున మాత్రం ఈ ఏడాది లీడ్ రోల్స్ కాకుండా ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. నటనకు ప్రశంసలు దక్కినా, బాక్సాఫీస్ పరంగా మాత్రం ఈ రెండు సినిమాలు పెద్దగా నిలవలేకపోయాయి.
RRR తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమా మాత్రమే చేశారు. చరణ్ ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్ ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చినా, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. అయితే 2026లో రాబోయే ‘పెద్ది’, ‘డ్రాగన్’ సినిమాలపై ఇప్పటికే బలమైన బజ్ ఏర్పడింది.
ఇక ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ 2025లో పూర్తి స్థాయి విడుదలలు లేకుండా గ్యాప్ తీసుకున్నారు. ప్రభాస్ ‘కన్నప్ప’లో అతిథి పాత్రలో కనిపించినా, అది లీడ్ మూవీగా లెక్కలోకి రాదు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ ‘వరాణాసి’లో బిజీగా ఉండగా, ఆయన తదుపరి థియేట్రికల్ రిలీజ్ 2027కి షెడ్యూల్ అయ్యింది. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2’ తర్వాత 2027లో అట్లీ ప్రాజెక్ట్‌తో తిరిగి రానున్నారు.
ఇక 2026 టాలీవుడ్‌కు (Tollywood)కీలక సంవత్సరంగా మారనుంది. వచ్చే సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో బాక్సాఫీస్‌ను టెస్ట్ చేయనున్నారు. అలాగే ప్రభాస్‌కు ‘ఫౌజీ’, చిరంజీవికి ‘విశ్వంభర’, రామ్ చరణ్‌కు ‘పెద్ది’, ఎన్టీఆర్‌కు ‘డ్రాగన్’ వంటి భారీ ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి.
మొత్తంగా 2025 టాలీవుడ్‌కు(Tollywood) స్టార్ పవర్ పరంగా పెద్దగా చెప్పుకునే సంవత్సరం కాదని చెప్పాలి. అయితే భారీ సినిమాలు, ఆసక్తికరమైన కాంబినేషన్లతో 2026 పరిశ్రమకు మళ్లీ ఊపునివ్వబోతోందన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా కనిపిస్తోంది.
