తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులు కొంత మంది కలిసి నిన్న సోమవారం సాయత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో సందడి చేశారు. వంశీ, సుకుమార్ ల ఆహ్వానం మేరకు రాజమౌళి, అనిల్ రావిపూడి , సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్, కొరటాల శివ, హరీష్ శంకర్, క్రిష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వీరు అందరు కలిసి విందులో పాల్గొన్న అనంతరం సరదాగా చర్చించుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల వరకు కొనసాగిన ఈ చర్చల్లో రకరకాల విషయాలను గురించి చర్చించుకున్నట్లు, అందులో హరీష్ శంకర్, కొరటాల సేవలు చెప్పిన సింగిల్ లైన్ స్టోరీలు కూడ ఉన్నాయని రాజమౌళి సోషల్ మీడియాలో చెప్పగా అద్భుతమైన వ్యక్తులతో ఎప్పటికి గుర్తిండిపోయే సాయంత్రాన్ని గడిపాను. తమ సమయాన్ని కేటాయించి వచ్చిన అందరికి ధన్యవాదాలు అని ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశాడు వంశీ. ప్రస్తుతం ఈ విషయమే టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
